Junior NTR: ఎన్టీఆర్ 30వ సినిమా హీరోయిన్ గా రష్మిక?

Rashmika in koratala movie
  • ఎన్టీఆర్ 30వ సినిమాకి సన్నాహాలు
  • త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ప్రాజెక్టు 
  • కథానాయికగా తెరపైకి రష్మిక పేరు
  • వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రష్మిక
రష్మిక ఇప్పుడు తెలుగుతో పాటు తమిళ .. హిందీ సినిమాలతోను బిజీగా ఉంది. తెలుగులో మాదిరిగానే ఇతర భాషల్లోను స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకోవడానికి గట్టిగానే ప్రయత్నం చేస్తోంది. 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో హిట్ కొట్టిన ఈ బ్యూటీ, ఇప్పుడు 'పుష్ప 2' సినిమా కోసం సెట్స్ పైకి వెళ్లడానికి వెయిట్ చేస్తోంది. 

ఈ గ్యాప్ లోనే తమిళంలో విజయ్ 'వరిసు' సినిమాను చక్కబెట్టే ప్రయత్నంలో ఉంది. అలాంటి రష్మిక పేరును కొరటాల పరిశీలిస్తున్నట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ 30వ సినిమాకి కొరటాల దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం రష్మికను సంప్రదించినట్టుగా చెబుతున్నారు. 

ఆల్రెడీ రష్మిక ఓకే చెప్పడం కూడా జరిగిపోయిందని అంటున్నారు. అందుకు ఆమెకి భారీ మొత్తమే చెల్లిస్తున్నారని చెబుతున్నారు. స్క్రిప్ట్ లో మార్పులు .. చేర్పుల కారణంగా సెట్స్ పైకి వెళ్లడంలో ఆలస్యమైందని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్  షూటింగు మొదలు కానుందని చెబుతున్నారు.
Junior NTR
Rashmika Mandanna
Koratala Siva

More Telugu News