Noida: పని చేయించుకుని డబ్బులు ఇవ్వలేదన్న కోపం.. యజమాని బెంజ్ కారుకు నిప్పు.. వీడియో ఇదిగో

Noida Man sets Mercedes ablaze after owner fails to pay his dues
  • ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఘటన
  • టైల్స్ వేయించుకుని డబ్బులు ఇవ్వకుండా తిప్పించుకుంటున్న వ్యక్తి
  • విసిగిపోయి కారుపై పెట్రోలు పోసి నిప్పంటించిన కార్మికుడు
తనతో పని చేయించుకుని డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఓ టైల్స్ కార్మికుడు యజమాని ఖరీదైన కారుకు నిప్పు పెట్టాడు. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా సెక్టార్-39లో జరిగిందీ ఘటన. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి కథనం ప్రకారం.. జలాల్‌పూర్ గ్రామానికి చెందిన టైల్స్ కార్మికుడు రణ్‌వీర్.. నోయిడాలోని సదర్‌పూర్ కాలనీకి చెందిన ఆయుష్ చౌహాన్ ఇంట్లో టైల్స్ వేశాడు. ఇందుకు సంబంధించి రణ్‌వీర్‌కు ఆయుష్ రూ. 68 వేలు చెల్లించాల్సి ఉంది. 

ఎన్నిసార్లు అడిగినా వాయిదాలు వేస్తుండడంతో రణ్‌వీర్ విసిగిపోయాడు. డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న ఆయుష్‌పై పగ తీర్చుకోవాలని అనుకున్నాడు. అందులో భాగంగా మంగళవారం బైక్‌పై సదర్‌పూర్ కాలనీకి వచ్చిన రణ్‌వీర్.. ఇంటి బయట పార్క్ చేసిన ఆయుష్ బెంజ్ కారుపై పెట్రోలు పోసి నిప్పంటించి పరారయ్యాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆయుష్ చౌహాన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రణ్‌వీర్‌ను అరెస్ట్ చేశారు.
Noida
Mercedes Benz
Uttar Pradesh

More Telugu News