Karimnagar District: అందరికీ కనిపించేలా జేబులో తుపాకి పెట్టుకున్న టీఆర్ఎస్ నాయకుడు.. వైరల్ అవుతున్న ఫొటో

TRS Leader who wear gun in his pant pocket went viral
  • హుజూరాబాద్‌లో విచ్చలవిడిగా తుపాకి లైసెన్స్‌లు ఇస్తున్నారన్న ఈటల
  • ఆ వెంటనే వైరల్ అయిన ఫొటో
  • ఈటల వ్యాఖ్యలను ఖండించిన కరీంనగర్ సీపీ
  • రెండేళ్లలో ఇచ్చింది ఇద్దరికేనని వివరణ
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌కు చెందిన టీఆర్ఎస్ నాయకుడు ఒకరు తన ప్యాంటు వెనక జేబులో అందరికీ కనిపించేలా పెట్టుకున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతోంది. తన నియోజకవర్గంలోని పలువురికి గన్ లైసెన్స్‌లు ఇస్తున్నారని హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించిన నేపథ్యంలో ఈ ఫొటో వెలుగులోకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, గన్‌ను అందరికీ కనిపించేలా పెట్టుకున్న ఆ నాయకుడు ఓ ఎంపీపీ భర్త కావడం గమనార్హం.

ఆయన ఫొటో వైరల్ కావడంతో కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ స్పందించారు. హుజూరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ వ్యాఖ్యలను ఖండించారు. నియోజకవర్గంలో విచ్చలవిడిగా గన్ లైసెన్స్‌లు ఇస్తున్నారనేది అవాస్తవమన్నారు. గత రెండేళ్లలో ఇద్దరికి మాత్రమే లైసెన్స్ ఇచ్చినట్టు చెప్పారు. తన వద్దనున్న తుపాకిని అందరికీ కనిపించేలా పెట్టుకున్న ఆ నాయకుడిని హెచ్చరించామని, మరోసారి ఇలా చేస్తే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించినట్టు కమిషనర్ సత్యనారాయణ తెలిపారు.
Karimnagar District
Huzurabad
Gun
TRS
Etela Rajender

More Telugu News