Shahrukh Khan: చెన్నైలో 'తలైవా'ను కలిసిన షారుఖ్ ఖాన్

Shah Rukh Khan met Thalaiva Rajinikant in Chennai
  • 'జైలర్' చిత్రంలో నటిస్తున్న రజనీకాంత్
  • ప్రస్తుతం చెన్నైలో షూటింగ్
  • షారుఖ్ నటిస్తున్న 'జవాన్' షూటింగ్ కూడా చెన్నైలోనే!
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ చెన్నైలో నేడు తలైవా రజనీకాంత్ ను కలిశారు. చెన్నైలోని ఓ సినీ స్టూడియో అందుకు వేదికగా నిలిచింది. రజనీకాంత్ ప్రస్తుతం తన 169వ చిత్రం 'జైలర్' షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ చిత్రానికి సంబంధించి రజనీకాంత్, రమ్యకృష్ణ, తమన్నా, శివరాజ్ కుమార్ లపై కీలక సన్నివేశాలను చెన్నైలో చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. 

అదే సమయంలో బాలీవుడ్ అగ్రహీరో షారుఖ్ ఖాన్ నటిస్తున్న 'జవాన్' చిత్రం కూడా చెన్నైలోనే షూటింగ్ జరుపుకుంటోంది. అది కూడా రజనీ 'జైలర్' షూటింగ్ జరుగుతున్న స్టూడియోలోనే చిత్రీకరణ జరుపుకుంటోంది. 

ఈ రెండు చిత్రాల సెట్స్ పక్కపక్కనే ఉండడంతో రజనీకాంత్ ను షారుఖ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరువురు కాసేపు ముచ్చటించారు. తమ ప్రస్తుత సినిమాలు, కొత్త ప్రాజెక్టులపై చర్చించుకున్నారు. కాగా, షారుఖ్ నటిస్తున్న 'జవాన్' చిత్రం కోలీవుడ్ దర్శకుడు అట్లీ డైరెక్షన్ లో తెరకెక్కుతోంది.
Shahrukh Khan
Rajinikanth
Chennai
Jailer
Jawan
Shooting

More Telugu News