Accident: జమ్మూ కశ్మీర్ లో ఘోర బస్సు ప్రమాదం... 11 మంది మృతి

Eleven people dead as mini bus fallen into a gorge in Jammu Kashmir
  • పూంచ్ జిల్లాలో ఘటన
  • మండి నుంచి సాజియాన్ వెళుతున్న మినీ బస్సు
  • లోతైన లోయలోకి పడిపోయిన వైనం
  • మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా
జమ్మూ కశ్మీర్ లో ఓ మినీ బస్సు ప్రమాదానికి గురైన ఘటనలో 11 మంది దుర్మరణం పాలయ్యారు. పూంచ్ జిల్లాలో బస్సు లోయలో పడింది. ఆ సమయంలో బస్సు మండి నుంచి సాజియాన్ ప్రాంతానికి వస్తోంది. సాజియాన్ సమీపంలో ఓ లోతైన లోయలోకి బస్సు పడిపోవడంతో తీవ్ర ప్రాణనష్టం సంభవించింది. గాయపడిన వారిని మండిలోని ఓ ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

కాగా, మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్టు జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వెల్లడించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.
Accident
Mini Bus
Gorge
Sawjian
Poonch District
Jammu And Kashmir

More Telugu News