మరోసారి 5 వేలు దాటిన కరోనా కేసులు

14-09-2022 Wed 10:59 | National
  • గత 24 గంటల్లో 5,108 కరోనా కేసుల నమోదు
  • దేశ వ్యాప్తంగా 19 మంది మరణం
  • దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 45,749
Fresh Corona cases in India crosses 5K
దేశంలో కరోనా కేసులు కొంచెం అటూ ఇటుగా నిలకడగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 3.55 లక్షల మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా... 5,108 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 5,675 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 19 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 45,749 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

ఇక దేశంలో రోజు వారీ పాజిటివిటీ రేటు 1.44 శాతంగా, క్రియాశీల రేటు 0.10 శాతంగా, రికవరీ రేటు 98.71 శాతంగా, మరణాల రేటు 1.19 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 2,15,67,06,574 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న 19,25,881 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.