IMD: ఏపీ సహా పలు రాష్ట్రాల్లో నేడు అతి భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ

  • దేశంలోని పలు రాష్ట్రాల్లో నేడు అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ
  • ఉత్తరాఖండ్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
  • పలు ప్రాంతాల్లో రెడ్, ఎల్లో అలెర్ట్‌ల జారీ
IMD predicts heavy rainfall in Maharashtra Andhra and other states

ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో నేడు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. ఐఎండీ పేర్కొన్న జాబితాలో ఏపీ తర్వాత మహారాష్ట్ర, సిక్కిం, గుజరాత్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, బీహార్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఝార్ఖండ్, నాగాలాండ్, గోవా ఉన్నాయి. వచ్చే మూడు రోజులు ఈ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే, కోస్తాంధ్ర, కర్ణాటక, తమిళనాడులో నేడు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.

ఉత్తరాఖండ్‌లో నేడు ఉరుములు, మెరుపులతో కూడిన అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించింది. మహారాష్ట్రలోని ముంబై, థానే, సింధూదుర్గ్ ప్రాంతాల్లో అధికారులు ఎల్లో అలెర్ట్ ప్రకటించారు. ఇక, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవాతోపాటు ముంబయి, రాయ్‌గఢ్, రత్నగిరి, థానే, పాల్ఘర్ జిల్లాల్లో వచ్చే ఐదు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.

More Telugu News