Andhra Pradesh: ఏపీలో 6 పార్టీలను జాబితా నుంచి తొలగించిన కేంద్ర ఎన్నికల సంఘం

  • దేశ వ్యాప్తంగా 86 పార్టీల తొలగింపు
  • 253 పార్టీలు ఉనికిలో లేవని ప్రకటన
  • పార్టీ రిజిస్టర్ అయిన ఐదేళ్ల లోపు ఎన్నికల్లో పోటీ చేయాలన్న కేంద్ర ఎన్నికల సంఘం
CEC removes 6 parties in Andhra Pradesh

ఏపీలో గుర్తింపు లేని ఆరు రాజకీయ పార్టీలను కేంద్ర ఎన్నికల సంఘం తన జాబితా నుంచి తొలగించింది. దేశ వ్యాప్తంగా 86 పార్టీలను తొలగించడమే కాక... 253 పార్టీలు ఉనికిలో లేవని ప్రకటించింది. దీంతో దేశంలో ఇప్పటి వరకు ఉనికిలో లేని పార్టీల సంఖ్య 537కి చేరింది.

ఏపీలో తొలగించిన పార్టీలు ఇవే:
భారతదేశం పార్టీ, ఇండియన్స్ ఫ్రంట్, జాతీయ తెలుగు అభివృద్ధి సేవా సమూహం, మన పార్టీ, ప్రజా భారత్ పార్టీ, ఆలిండియా ముత్తాహిదా ఖ్వామీ మహాజ్. 

మరోవైపు, ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటన చేసింది. పార్టీ రిజిస్టర్ అయిన ఐదేళ్ల లోపు ఎన్నికల సంఘం నిర్వహించే ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంటుందని ప్రకటనలో తెలిపింది. ఆ తర్వాత కూడా పోటీ చేయడాన్ని కొనసాగించాలని పేర్కొంది. ఆరేళ్ల పాటు ప్రతి ఎన్నికల్లో పోటీ చేయకపోతే... రిజిస్టర్డ్ పార్టీల జాబితా నుంచి పార్టీ తొలగించబడుతుందని తెలిపింది.

More Telugu News