Fitness Trainer: ముంబైలో తెలుగు నటిపై ఫిట్‌నెస్ ట్రైనర్ అత్యాచారం

Fitness trainer accused of rape by Telugu actor held in Mumbai
  • పెళ్లి పేరుతో నటిపై పలుమార్లు అత్యాచారం
  • పెళ్లి మాటెత్తితే చంపేస్తానని బెదిరింపు
  • ప్రైవేటు ఫొటోలు బయటపెడతానని హెచ్చరిక
  • అరెస్ట్ చేసిన పోలీసులు
ముంబైలో ఓ తెలుగు నటిపై ఫిట్‌నెస్ ట్రైనర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. నటి ఫిర్యాదుపై పోలీసులు నిన్న నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కూఫీ పరేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిట్‌నెస్ ట్రైనర్ అయిన ఆదిత్య కపూర్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. 

ఆ తర్వాత పెళ్లి మాటెత్తడం మానేశాడని, అడిగితే తనను దూషించడమే కాకుండా దాడి కూడా చేశాడని బాధితురాలు ఆరోపించింది. అంతేకాకుండా సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన చిత్రాలను బయటపెడతానని బెదిరించడమే కాకుండా చంపేస్తానని హెచ్చరించాడని పేర్కొంది. ఆమె ఫిర్యాదుపై ఆదిత్య కపూర్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా, 2016 నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న బాధితురాలు పలు చిత్రాల్లో నటించింది.
Fitness Trainer
Tollywood
Actress
Mumbai
Rape Case

More Telugu News