ఈ నెల 23 నుంచే ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డే సేల్.. వివరాలు ఇవిగో

Flipkart big billion days sale dates announced
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ ఏటా నిర్వహించే బిగ్ బిలియన్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. ఈ సేల్ కు సంబంధించి కొన్ని రోజులుగా ప్రకటనలతో ఊరిస్తూ వచ్చిన ఫ్లిప్ కార్ట్ సంస్థ.. ఈ నెల 23వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్ ను నిర్వహించనున్నట్టు తాజాగా ప్రకటించింది. సరిగ్గా ఇదే తేదీన అటు మరో ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా తమ ‘గ్రేట్ ఇండియన్ సేల్’ను ప్రారంభిస్తుండటం గమనార్హం. 

ఎలక్ట్రానిక్ పరికరాలపై భారీ డిస్కౌంట్..
  • ఫ్లిప్ కార్ట్ సంస్థ ఏటా దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో ‘బిగ్ బిలియన్ డేస్’ పేరిట ఆఫర్ సేల్ ను నిర్వహిస్తుంది. అదే క్రమంలో ఈసారి సేల్ చేపట్టింది.
  • ఎనిమిది రోజుల పాటు జరిగే ఈ ప్రత్యేక సేల్‌ లో స్మార్ట్‌ ఫోన్లు, ల్యాప్‌ ట్యాప్‌ లు, స్మార్ట్‌ వాచ్‌ లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, వాటి యాక్సెసరీస్‌ పై భారీగా డిస్కౌంట్లను అందించనున్నట్టు ప్రకటించింది.
  • బిగ్ బిలియన్ డేస్ సేల్ లో ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌ డెబిట్, క్రెడిట్‌ కార్డులపై 10 శాతం ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ ఇవ్వనున్నట్టు ఫ్లిప్‌ కార్ట్‌ ప్రకటించింది. వీటితోపాటు పేటీఎం యూపీఐ, వాలెట్‌ లావాదేవీలపైనా 10 శాతం దాకా తగ్గింపు ఇస్తున్నట్టు తెలిపింది.
  • ప్రత్యేక సేల్ లో భాగంగా.. ఆఫర్ కొనసాగే రోజుల్లో అర్ధరాత్రి 12 గంటలకు, ఉదయం 8 గంటలకు, సాయంత్రం 4 గంటలకు రష్‌ అవర్స్‌ పేరిట ప్రత్యేక డీల్స్‌ అందుబాటులో ఉంటాయని ఫ్లిప్ కార్ట్ వివరించింది. 
  • పోకో ఎఫ్‌ 4, పోకో ఎక్స్ 4 ప్రో 5జీ, గూగుల్ పిక్సల్‌ 6ఏ, ఒప్పో రెనో 8, మోటోరొలా ఎడ్జ్‌ 30, రియల్‌ మీ 9 5జీ, పోకో సీ 31, వివో టీ1 5జీ, శాంసంగ్‌ ఎఫ్‌ 13 ఫోన్లపై డిస్కౌంట్లు ఉండబోతున్నట్టు పేర్కొంది.
  • ఆఫర్ సమయంలో కేవలం ఒక్క రూపాయి చెల్లించి వస్తువులను ముందుగానే బుక్ చేసుకునే అవకాశం ఉంటుందని ఫ్లిప్ కార్ట్ తెలిపింది.
Go Back to Shorts
Flipkart
Big Billion Days Sale
Business
Ecommerce
India
Offbeat

More Telugu News