Janasena: మృతి చెందిన కార్య‌క‌ర్త‌ల కుటుంబాలకు రూ.5 ల‌క్ష‌ల చొప్పున పరిహారం అందించిన జ‌న‌సేన‌

janasena handed over insurence cheque to party member family
  • క్రియాశీల స‌భ్యుల‌కు బీమా చేయించిన జ‌న‌సేన‌
  • ఇటీవ‌లే రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన వీర నాగాంజ‌నేయులు
  • బీమా ప‌రిహారాన్ని బాధిత కుటుంబానికి అందించిన నాదెండ్ల‌
  • మరణించిన మరో కార్యకర్త దాకారపు కొండలు కుటుంబానికి పరిహారం అందజేత
  • భ‌విష్య‌త్తులో ఎలాంటి ఇబ్బంది వ‌చ్చినా అండ‌గా ఉంటామ‌ని భ‌రోసా
జ‌న‌సేన క్రియాశీల స‌భ్యుల‌కు ఆ పార్టీ బీమా సౌక‌ర్యం క‌ల్పిస్తున్న సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగా ఇటీవ‌లే రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందిన పార్టీ క్రియాశీల స‌భ్యుడు పిన్న‌మ‌నేని వీర నాగాంజ‌నేయులు కుటుంబానికి ఆ పార్టీ రూ.5 ల‌క్ష‌ల బీమా ప‌రిహారాన్ని అంద‌జేసింది. ఈ మేర‌కు కృష్ణా జిల్లా పెడ‌న నియోజ‌క‌వ‌ర్గం గూడూరు మండ‌లం క‌త్తుల‌వారిపాలెం వెళ్లిన జ‌న‌సేన పీఏసీ చైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్‌... బాధిత కుటుంబానికి రూ.5 ల‌క్ష‌ల బీమా ప‌రిహారం చెక్కును అంద‌జేశారు. బాధిత కుటుంబాన్ని ఆయ‌న ఓదార్చారు. భ‌విష్య‌త్తులో ఎలాంటి ఇబ్బంది వ‌చ్చినా పార్టీ అండ‌గా ఉంటుంద‌ని ఆయ‌న బాధిత కుటుంబానికి భ‌రోసా ఇచ్చారు. ఇదిలా ఉంటే... ఇటీవ‌లే మ‌ర‌ణించిన పార్టీ క్రియాశీల స‌భ్యుడు దాకార‌పు కొండలు కుటుంబానికి కూడా నాదెండ్ల రూ.5 ల‌క్ష‌ల బీమా ప‌రిహారాన్ని అంద‌జేశారు.
Janasena
Pawan Kalyan
Nadendla Manohar
Krishna District

More Telugu News