Nagarjuna: అక్టోబరు 5నే 'ఘోస్ట్' రిలీజ్... ఇది పక్కా

Nagarjuna starred Ghost will be released on October 5
  • నాగార్జున, సోనాల్ చౌహాన్ జంటగా 'ఘోస్ట్'
  • ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చిత్రం
  • ఇప్పటిదాకా రిలీజ్ డేట్ పై అనిశ్చితి
  • ముందు నిర్ణయించిన తేదీకే వస్తున్నామన్న దర్శకుడు
నాగార్జున, సోనాల్ చౌహాన్ జంటగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న హై ఓల్టేజ్ యాక్షన్ చిత్రం 'ఘోస్ట్'. ఈ చిత్రం విడుదలపై ఇప్పటిదాకా నెలకొన్న ఊగిసలాటకు దర్శకుడు చెక్ పెట్టారు. తమ చిత్రం అక్టోబరు 5నే రిలీజ్ అవుతుందని స్పష్టం చేశారు. దాంతో ఈ దసరాకు నాగ్ చిత్రం వచ్చేది ఖాయమైంది. ఇదే రోజున మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' చిత్రం కూడా వస్తున్నా, 'ఘోస్ట్' వెనక్కి తగ్గేది లేదని చిత్రబృందం తమ తాజా నిర్ణయంతో స్పష్టం చేసింది. దాంతో దసరా సీజన్ లో పెద్ద హీరోల సందడి షురూ కానుంది. 

శ్రీవెంకటేశ్వరా సినిమాస్ ఎల్ఎల్ పీ, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ చిత్రాన్ని పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మిస్తున్నారు. ఇటీవల వచ్చిన థియేట్రికల్ ట్రైలర్ సైతం విశేషంగా ఆకట్టుకుంది. 'ఘోస్ట్' చిత్రంపై అంచనాలను భారీగా పెంచేసింది.
Nagarjuna
Ghost
Release Date
Tollywood

More Telugu News