భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- 456 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 134 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 4 శాతం లాభపడ్డ బజాన్ ఫిన్ సర్వ్ షేర్ విలువ
ఈ క్రమంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 456 పాయింట్లు లాభపడి 60,571కి చేరుకుంది. నిఫ్టీ 134 పాయింట్లు పెరిగి 18,070 వద్ద స్థిరపడింది. ఆటో, ఎనర్జీ, రియాల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు మినహా అన్ని సూచీలు లాభాలను మూటకట్టుకున్నాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫిన్ సర్వ్ (4.00%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.48%), భారతి ఎయిర్ టెల్ (2.04%), టైటాన్ (1.68%), బజాజ్ ఫైనాన్స్ (1.56%).
టాప్ లూజర్స్:
టీసీఎస్ (-0.37%), ఏసియన్ పెయింట్స్ (-0.29%), టెక్ మహీంద్రా (-0.20%), డాక్టర్ రెడ్డీస్ (-0.15%), సన్ ఫార్మా (-0.07%).