Elon Musk: తమ డేటింగ్ ఫొటోలను వేలం వేస్తున్న ఎలాన్ మస్క్ మాజీ ప్రేయసి

Elon Musk ex girl friend auctions their dating memories
  • పెన్సిల్వేనియా కాలేజీలో చదివిన ఎలాన్ మస్క్
  • జెన్నిఫర్ గ్వైన్ తో ప్రేమాయణం
  • కాలేజీ చదువు తర్వాత విడిపోయిన వైనం
  • ఆ తర్వాత ఒకసారి కలుసుకున్న మస్క్, గ్వైన్
టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ గతంలో పెన్సిల్వేనియా కాలేజీలో చదివిన సమయంలో జెన్నిఫర్ గ్వైన్ తో ప్రేమాయణం నడిపారు. ఆ తర్వాత ఎవరి దారిన వారు విడిపోయారు. పెన్సిల్వేనియా నుంచి మస్క్ పాలోఆల్టో తరలి వెళ్లాడు. ఆ తర్వాత అతడిని గ్వైన్ ఒక్కసారి మాత్రమే కలిసిందట. ఇప్పుడు ఆమె కీలక నిర్ణయం తీసుకుంది. 

అప్పట్లో ఎలాన్ మస్క్ తో డేటింగ్ సందర్భంగా మధుర జ్ఞాపకాల్లా నిలిచిన చిత్రాలను వేలం వేస్తోంది. తన సవతి కుమారుడి స్కూలు ఫీజులు చెల్లించేందుకు తనకు ఇంతకంటే మార్గం లేదని గ్వైన్ చెబుతోంది. 

గ్వైన్ వేలం వేస్తున్న వాటిలో, ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఎలాన్ మస్క్ స్వదస్తూరీతో రాసిన గ్రీటింగ్ కార్డు కూడా ఉంది. ఈ కార్డుకు 10 వేల డాలర్లకు పైనే ధర పలుకుతుందని భావిస్తున్నారు. 

అంతేకాదు, ఎలాన్ మస్క్ సంతకంతో కూడిన డాలర్ నోటును కూడా గ్వైన్ వేలానికి ఉంచింది. ప్రస్తుతానికి ఈ డాలర్ నోటుకు 7,604 డాలర్ల వద్ద బిడ్డింగ్ నడుస్తోంది. ఇవే కాకుండా, మస్క్, గ్వైన్ కలిసి దిగిన ఫొటోలు కూడా వేలంలో ఉన్నాయి.
.
Elon Musk
Jennifer Gwynne
Dating
Auction

More Telugu News