Corona Virus: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

India corona updates
  • గత 24 గంటల్లో 4,369 కేసుల నమోదు
  • ఇదే సమయంలో కోలుకున్న వారి సంఖ్య 5,178
  • 46,347కి తగ్గిన యాక్టివ్ కేసుల సంఖ్య

దేశంలో కరోనా వైరస్ ప్రభావం క్రమంగా తగ్గుతోంది. రోజువారీగా నమోదవుతున్న కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 4,369 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 5,178 మంది కోలుకున్నారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 46,347కి తగ్గింది.

ఇక ఇప్పటి వరకు కరోనా కారణంగా 5,28,185 మంది మృతి చెందారు. అలాగే ఇప్పటి వరకు 4,39,30,417 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో క్రియాశీల రేటు 0.10 శాతంగా, రికవరీ రేటు 98.71 శాతంగా, మరణాల రేటు 1.19 శాతంగా ఉన్నాయి. ఇంతవరకు 2,15,47,80,693 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న 21,67,644 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. 

  • Loading...

More Telugu News