Prabhas: ఢిల్లీ రామ్ లీలా మైదానంలో జరిగే ఉత్సవాలకు ప్రభాస్ కు ఆహ్వానం?

Prabhas to the guest for Dasara celebrations in Delhi Ram Leela Maidan
  • దసరా ఉత్సవాలకు సిద్ధమవుతున్న యావత్ దేశం
  • రామ్ లీలా మైదానంలో ప్రతి ఏటా ఘనంగా రావణ దహన కార్యక్రమం
  • ఈ కార్యక్రమానికి సెలబ్రిటీలను ఆహ్వానించడం పరిపాటి

దసరా ఉత్సవాలకు యావత్ దేశం సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో ప్రతి ఏటా దసరా ఉత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. దసరా ఉత్సవాల చివరి రోజున రావణ దహనం కార్యక్రమాన్ని జరుపుతారు. ఈ కార్యక్రమానికి సెలబ్రిటీలను ఆహ్వానించడం పరిపాటిగా వస్తోంది. సెలబ్రిటీల చేతుల మీదుగానే రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మరోవైపు, రావణ దహన కార్యక్రమానికి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఆహ్వానం అందినట్టు సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ 'ఆదిపురుష్' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఆయన శ్రీరాముడి పాత్రను పోషిస్తున్నాడు. దీంతో, ప్రభాస్ ను గెస్ట్ గా పిలిచినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News