Andhra Pradesh: ఈ నెల 27న ఢిల్లీకి రండి!... తెలుగు రాష్ట్రాల సీఎస్‌ల‌కు కేంద్ర హోం శాఖ లేఖ‌లు!

  • ఏపీ విభ‌జ‌న చ‌ట్టంలోని అంశాల అమ‌లుపై కేంద్ర హోం శాఖ దృష్టి
  • పెండింగ్ అంశాల‌పై ఈ నెల 27న కేంద్ర హోం శాఖ కార్య‌ద‌ర్శి ఆధ్వ‌ర్యంలో స‌మీక్ష‌
  • స‌మావేశానికి హాజ‌రు కావాల‌ని ఇరు రాష్ట్రాల సీఎస్‌ల‌కు లేఖ‌లు
తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు స‌మీర్ శ‌ర్మ‌, సోమేశ్ కుమార్‌ల‌కు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమ‌వారం లేఖ‌లు రాసింది. ఈ నెల 27న ఢిల్లీకి రావాలంటూ ఇద్ద‌రు సీఎస్‌ల‌ను కేంద్ర హోం శాఖ కోరింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న అంశాలు, వాటి అమ‌లు, ఇంకా అమ‌లుకు నోచుకోని అంశాల అమ‌లు... త‌దిత‌ర అంశాలపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇరు రాష్ట్రాల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న సంగ‌తి తెలిసిందే.

ఈ క్ర‌మంలో రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టంలోని ఇంకా అమ‌లు కాని అంశాల‌పై చ‌ర్చ‌కు కేంద్ర హోం శాఖ సిద్ధ‌మైంది. ఈ దిశ‌గా ఈ నెల 27న ఇరు రాష్ట్రాల‌తో స‌మావేశం కావాల‌ని కేంద్ర హోం శాఖ కార్య‌ద‌ర్శి నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలోనే స‌ద‌రు స‌మావేశానికి హాజ‌రు కావాలంటూ ఆయ‌న ఇరు రాష్ట్రాల సీఎస్‌ల‌కు లేఖ‌లు రాశారు. విభ‌జ‌న చ‌ట్టంలోని పెండింగ్ అంశాల‌పైనే ఈ స‌మావేశంలో చ‌ర్చ జ‌ర‌గ‌నున్న‌ట్లు స‌మాచారం.
Andhra Pradesh
Telangana
Ministry Of Home Affairs
AP CS
TS CS
Somesh Kumar
Sameer Sharme

More Telugu News