Andhra Pradesh: బెజవాడ కనకదుర్గమ్మకు మూడు బంగారు కిరీటాలు.. కానుకగా సమర్పించిన భక్తుడు

A devotee donates three golden crowns to goddess Kanaka Durga
  • ఒక్కోటి 1308 గ్రాములున్న కిరీటాలు
  • ఆలయ ఈవో భ్రమరాంబకు అందజేత
  • ఉత్సవ విగ్రహాల అలంకరణ కోసం ఉపయోగించనున్న ఆలయ అధికారులు
బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు ఓ భక్తుడు మూడు బంగారు కిరీటాలను కానుకగా సమర్పించాడు. నవీ ముంబైకి చెందిన రెకాన్ మెరైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ యజమాని జి.హరికృష్ణారెడ్డి వీటిని అమ్మవారికి సమర్పించారు. 

అమ్మవారి ఉత్సవ విగ్రహ అలంకరణ కోసం తయారు చేయించిన ఈ కిరీటాలు ఒక్కోటి 1308 గ్రాముల బరువున్నాయి. ఆలయ ఈవో భ్రమరాంబకు ఆయన వీటిని అందజేశారు. అమ్మవారి దర్శనానంతరం హరికృష్ణారెడ్డి కుటుంబానికి ప్రధానార్చకులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ ఈవో ప్రసాదం, అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రం అందజేశారు.
Andhra Pradesh
Vijayawada
Goddess Kanaka Durga
Golden Crowns

More Telugu News