Amaravati: అమ‌రావ‌తి రైతుల యాత్ర‌లో రేణుకా చౌద‌రి... పుష్ప డైలాగ్‌తో ఆక‌ట్టుకున్న కాంగ్రెస్ నేత‌

t congress leader renuka choudary participated in amaravati farmers padayatra
  • అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ కోసం మ‌హాపాద‌యాత్ర ప్రారంభం
  • యాత్ర‌లో పాల్గొని సంపూర్ణ మ‌ద్ద‌తు తెలిపిన రేణుకా చౌద‌రి
  • పుష్ప డైలాగ్‌తో రైతుల్లో ఉత్సాహం నింపిన కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌
ఏపీ రాజ‌ధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ కోసం సోమ‌వారం ప్రారంభించిన మ‌హాపాద‌యాత్ర‌కు తెలంగాణ‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత రేణుకా చౌద‌రి సంఘీభావం ప్ర‌క‌టించారు. సోమ‌వారం యాత్రకు స్వ‌యంగా హాజ‌రైన ఆమె టాలీవుడ్ హిట్ సినిమా పుష్ప‌లోని పాప్యుల‌ర్ డైలాగ్ చెబుతూ ఆక‌ట్టుకున్నారు.

ఏపీకి ఏకైక రాజ‌ధానిగా అమ‌రావ‌తిని ప్ర‌క‌టించేదాకా త‌గ్గేదే లే అంటూ పుష్ప సినిమా డైలాగ్ చెప్పిన రేణుకా చౌద‌రి... ఆ సినిమాలో హీరో అల్లు అర్జున్ ప్ర‌ద‌ర్శించిన హావ‌భావాల‌ను ప్ర‌ద‌ర్శించారు. రేణుకా చౌద‌రి పుష్ప డైలాగ్‌తో అమ‌రావతి రైతుల్లో మ‌రింత ఉత్సాహం ఇనుమ‌డించింది. అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ కోసం జ‌రుగుతున్న ఉద్య‌మానికి ఆది నుంచి మ‌ద్ద‌తు ప‌లుకుతున్న రేణుకా చౌద‌రి ప‌లు కీల‌క స‌మ‌యాల్లో రైతుల ఉద్య‌మంలో స్వ‌యంగా పాలుపంచుకుంటున్న సంగ‌తి తెలిసిందే.
Amaravati
Andhra Pradesh
Amaravati Farmers
Renuka Choudary
Congress
Telangana

More Telugu News