TDP: లేపాక్షి భూముల వేలాన్ని మ‌ళ్లీ నిర్వ‌హించాల‌ని ఎన్‌సీఎల్‌టీ చెప్పింది: ప‌య్యావుల కేశ‌వ్‌

  • లేపాక్షి భూముల వేలాన్ని ఎన్‌సీఎల్‌టీ ర‌ద్దు చేసింద‌న్న ప‌య్యావుల‌
  • వేల కోట్ల విలువ చేసే భూముల‌ను రామానుజుల రెడ్డికి త‌క్కువ ధ‌ర‌కే క‌ట్ట‌బెట్టార‌ని ఆరోప‌ణ‌
  • ఆ త‌క్కువ మొత్తాన్ని కూడా రామానుజుల రెడ్డి చెల్లించ‌లేక‌పోయార‌న్న కేశవ్ 
  • ఇప్ప‌టికైనా పార‌ద‌ర్శ‌కంగా వేలాన్ని నిర్వ‌హించాల‌ని డిమాండ్‌
payyavula keshav said nclt cancels the auction of lepakshi lands

అనంత‌పురం జిల్లా ప‌రిధిలోని లేపాక్షి భూముల వ్య‌వ‌హారంపై టీడీపీ సీనియ‌ర్ నేత‌, ఏపీ పీఏసీ చైర్మ‌న్ ప‌య్యావుల కేశ‌వ్ సోమ‌వారం కీల‌క విష‌యాల‌ను వెల్ల‌డించారు. వేల కోట్ల రూపాయ‌ల విలువ చేసే లేపాక్షి భూముల‌కు సంబంధించి గ‌తంలో జ‌రిగిన వేలాన్ని ర‌ద్దు చేసిన నేష‌న‌ల్ కంపెనీ లా ట్రైబ్యున‌ల్ (ఎన్‌సీఎల్‌టీ).. ఈ భూముల వేలాన్ని తిరిగి నిర్వ‌హించాల‌ని ఆదేశాలు జారీ చేసింద‌ని ఆయ‌న చెప్పారు. ఇదివ‌ర‌కే జ‌రిగిన వేలంలో వేల కోట్ల రూపాయ‌ల విలువ చేసే లేపాక్షి భూముల‌ను న‌రేన్ రామానుజుల రెడ్డికి రాష్ట్ర ప్ర‌భుత్వం కేవ‌లం రూ.500 కోట్ల‌కే క‌ట్ట‌బెట్టింద‌ని ఆయ‌న ఆరోపించారు.

ఇంత త‌క్కువ ధ‌ర‌కు లేపాక్షి భూముల‌ను ద‌క్కించుకున్న రామానుజుల రెడ్డి... ఆ మొత్తాన్ని కూడా స‌కాలంలో చెల్లించ‌లేద‌ని కేశ‌వ్ తెలిపారు. ఈ క్ర‌మంలో గ‌డువులోగా రామానుజుల రెడ్డి వేలం మొత్తాన్ని చెల్లించ‌లేద‌ని తెలిపిన ఎన్‌సీఎల్‌టీ... ఆ మొత్తం చెల్లింపున‌కు మ‌రింత గ‌డువు ఇవ్వ‌లేమ‌ని తేల్చిచెప్పింద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ఎన్‌సీఎల్‌టీ తీర్పుతో ఇక‌నైనా లేపాక్షి భూముల వేలాన్ని పార‌ద‌ర్శ‌కంగా నిర్వ‌హించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

More Telugu News