Jagan: జగన్ తో మున్నూరు కాపు సంఘం నేతల భేటీ

Munnuru Kapu Sangham leaders meets Jagan
  • జగన్ తో భేటీ అయిన విలీనం మండలాల మున్నూరు కాపు సంఘం నేతలు
  • తమను బీసీ-డీలో చేర్చినందుకు ధన్యవాదాలు తెలిపిన నేతలు
  • జగన్ వెనుకే నడుస్తామన్న మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను విలీన మండలాల మున్నూరు కాపు సంఘం నేతలు ఈరోజు కలిశారు. కాపు కార్పొరేషన్ ఛైర్మన్ ఆధ్వర్యంలో జగన్ ను కలిశారు. తమకు బీసీ-డీ సర్టిఫికెట్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. వరద పర్యటన సమయంలో జగన్ ను కలిసిన మున్నూరు కాపులు తెలంగాణ మాదిరి తమను బీసీ-డీలో చేర్చాలని కోరారు. వారి విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన జగన్... వారిని బీసీ-డీ కేటగిరీలో చేర్చారు. 

ఈ సందర్భంగా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు ఉమా శంకర్ మాట్లాడుతూ, బతికినంత కాలం తాము జగన్ వెనుకే నడుస్తామని చెప్పారు. తమ విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు.
Jagan
ysrcp
Munnuru Kapu Sangham

More Telugu News