Jairam Ramesh: టీషర్టుల గురించి, లోదుస్తుల గురించి నేను మాట్లాడదల్చుకోలేదు: జైరాం రమేశ్

Jairam Ramesh hits out BJP criticism over Rahul Gandhi T Shirt
  • కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర
  • రాహుల్ టీషర్టు రూ.41 వేలంటూ బీజేపీ విమర్శలు
  • బీజేపీ నేతలు భయపడుతున్నారన్న జైరాం రమేశ్
  • విద్వేషం వ్యాపింపజేస్తున్నారని వ్యాఖ్యలు
భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ ధరించిన టీషర్టు ఖరీదు రూ.41 వేలు అంటూ బీజేపీ నేతలు విమర్శల దాడి చేస్తుండడంపై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ స్పందించారు. బీజేపీ చేసే రాజకీయాలన్నీ విచ్ఛిన్నకరమైనవేనని, ఐక్యతకు తోడ్పడే రాజకీయాలు బీజేపీ చేయదని విమర్శించారు. 

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత వంటి అంశాలకు సంబంధించినదని, ఒకవేళ వారు (బీజేపీ) కంటైనర్లు, బూట్లు, టీషర్టులు అని మాట్లాడుంటే వారు భయపడుతున్నట్టే లెక్క అని జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. తాను టీషర్టులు, లోదుస్తులపై మాట్లాడదల్చుకోలేదని అన్నారు.

బీజేపీ నేతల అబద్ధాల ఫ్యాక్టరీ ఓవర్ టైమ్ పనిచేస్తూనే ఉంటుందని ఎద్దేవా చేశారు. బీజేపీ నేతలు పుకార్లు, విద్వేషం వ్యాపింపజేస్తుంటారని విమర్శించారు.
Jairam Ramesh
T Shirt
Rahul Gandhi
BJP
Congress
India

More Telugu News