CM KCR: ఏపీ నుంచి తెలంగాణకే రూ.17,000 కోట్లు రావాలి: సీఎం కేసీఆర్

CM KCR speech on power sector issues
  • తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగం 
  • విద్యుత్ బకాయిల అంశం ప్రస్తావన
  • మరో రూ.3 వేల కోట్ల వడ్డీ అంటున్నారని వెల్లడి
  • తమకే ఏపీ నుంచి రావాల్సి ఉందని స్పష్టీకరణ
  • రూ.6 వేల కోట్లు మినహాయించుకోవాలన్న కేసీఆర్
  •  మిగతాది ఇప్పించాలని కేంద్రాన్ని డిమాండ్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో విద్యుత్, తదితర అంశాలపై సీఎం కేసీఆర్ సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఏపీకి రూ.3 వేల కోట్ల విద్యుత్ బకాయిలు కట్టాలని కేంద్రం చెబుతోందని, నెలలో కట్టకపోతే చర్యలు తీసుకుంటామని అంటోందని తెలిపారు. మరో రూ.3 వేల కోట్లు వడ్డీ అంటోందని తెలిపారు. ఏపీ నుంచి తెలంగాణకే రూ.17,000 కోట్లు రావాల్సి ఉందని, అందులో రూ.6 వేల కోట్లు మినహాయించి మిగతా మొత్తాన్ని కేంద్రమే ఇప్పించాలని డిమాండ్ చేశారు. 

ఏపీలోని కృష్ణపట్నం సహా అనేక రంగాల్లో తెలంగాణ వాటా ఉందని అన్నారు. తాను చెప్పిన విద్యుత్ లెక్కలు అబద్ధమని నిరూపిస్తే క్షణంలో రాజీనామా చేస్తానని కేసీఆర్ సవాల్ విసిరారు.
CM KCR
Power Sector
Telangana
Andhra Pradesh

More Telugu News