Naseem Shah: ఊర్వశి రౌతేలా ఎవరో తనకు తెలియదన్న పాకిస్థాన్ యువ బౌలర్

Pakistan young bowler Naseem Shah says he did no know who is Uravashi Rautela
  • ఇటీవల రీల్స్ వీడియో చేసిన ఊర్వశి రౌతేలా
  • వీడియో బ్యాక్ గ్రౌండ్ లో పాక్ బౌలర్ నసీమ్ షా
  • మీడియాలో వెల్లువెత్తిన కథనాలు
  • స్పందించిన నసీమ్ షా
ఇటీవల బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశి రౌతేలా చేసిన ఇన్ స్టాగ్రామ్ రీల్స్ వీడియో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ వీడియో బ్యాక్ గ్రౌండ్ లో పాకిస్థాన్ యువ బౌలర్ నసీమ్ షా క్లిప్పింగ్స్ కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఊర్వశి రౌతేలా, నసీమ్ షా మధ్య ఏంజరుగుతోందంటూ కథనాలు మొదలయ్యాయి. తర్వాత కొన్నిరోజులకే ఊర్వశి ఆ వీడియో క్లిప్పింగ్ ను తొలగించింది. 

ఈ నేపథ్యంలో, నసీమ్ షా స్పందించాడు. అసలీ ఊర్వశి రౌతేలా ఎవరో తనకు తెలియదన్నాడు. ఇలాంటి ప్రశ్నలు వింటుంటే నవ్వొస్తోందని అన్నాడు. ప్రజలు తనకు కొన్ని వీడియోలు పంపిస్తుంటారని, వాటిని తాను పెద్దగా పట్టించుకోనని తెలిపాడు. తన దృష్టంతా శ్రీలంకతో జరిగే ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ పైనే ఉందని నసీమ్ స్పష్టం చేశాడు. 

ఇటీవల ఆఫ్ఘనిస్థాన్ తో మ్యాచ్ లో చివర్లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టి పాకిస్థాన్ ను గెలిపించడంతో నసీమ్ షా పేరు మార్మోగుతోంది. ఇవాళ్టి ఫైనల్లోనూ అతడిపై పాక్ ఆశలు పెట్టుకుంది.
Naseem Shah
Urvashi Rautela
Reels
Video
Pakistan
Bollywood

More Telugu News