Imran Khan: విమాన ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డ ఇమ్రాన్ ఖాన్

Imran Khan plane suffers with technical issues
  • ఇస్లామాబాద్ నుంచి గుజ్రన్ వాలాకు బయల్దేరిన ఇమ్రాన్
  • విమానంలో తలెత్తిన సాంకేతిక లోపం
  • రోడ్డు మార్గంలో గుజ్రన్ వాలాకు వెళ్లిన ఇమ్రాన్
పాకిస్థాన్ మాజీ ప్రధాని, ప్రపంచ క్రికెట్ దిగ్గజం ఇమ్రాన్ ఖాన్ తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. వివరాల్లోకి వెళ్తే ఇస్లామాబాద్ నుంచి గుజ్రన్ వాలాకు ఈరోజు ఆయన ప్రత్యేక విమానంలో బయల్దేరారు. అయితే టేకాఫ్ అయిన వెంటనే విమానంలో అకస్మాత్తుగా సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో, ఆయన ప్రయాణిస్తున్న విమానం మళ్లీ వెంటనే ల్యాండ్ అయింది. 

అనంతరం ఆయన రోడ్డు మార్గంలో గుజ్రన్ వాలాకు వెళ్లారు. అక్కడ జరిగిన సభలో ఆయన భారత్ ను  ఆకాశానికి ఎత్తేశారు. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో కూడా రష్యా నుంచి ఇండియా చమురును కొనుగోలు చేసిందని ప్రశంసించారు.
Imran Khan
Pakistan
Plane
India

More Telugu News