Swamy Swaroopananda Saraswati: ద్వారకా పీఠాధిపతి శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి అస్తమయం

  • ఈ మధ్యాహ్నం కన్నుమూత
  • జ్యోతేశ్వర్ ఆశ్రమంలో తుదిశ్వాస
  • స్వరూపానంద వయసు 99 సంవత్సరాలు
Dwaraka Sankaracharya Swamy Swaroopananda Saraswati is no more

ద్వారకా పీఠాధిపతి, జగద్గురు శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి శివైక్యం చెందారు. ఆయన ఈ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. స్వరూపానంద వయసు 99 సంవత్సరాలు. మధ్యప్రదేశ్ లోని నర్సింగపూర్ లో ఉన్న శ్రీధామ్ జ్యోతేశ్వర్ ఆశ్రమంలో ఈ మధ్యాహ్నం 3.30 గంటలకు ఆయన కన్నుమూశారు. స్వామి స్వరూపానంద సరస్వతి దేశంలోని అత్యున్నత ఆధ్యాత్మిక పీఠాధిపతిగా ఉన్నారు. 

1300 సంవత్సరాల క్రితం ఆది శంకరాచార్యుల వారు ఏర్పాటుచేసిన నాలుగు శక్తి పీఠాల్లో ద్వారకా, జ్యోతిర్మఠ్ శక్తి పీఠాలకు స్వామి స్వరూపానంద అధిపతిగా కొనసాగుతున్నారు. స్వామి స్వరూపానంద మధ్యప్రదేశ్ లోని సియోనీ జిల్లా దిఘోరీ గ్రామంలో ఓ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. వేదవేదాంగాలను అభ్యసించి దేశంలో ప్రముఖ పీఠాధిపతిగా ఎదిగారు. స్వరూపానంద స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలుకు కూడా వెళ్లారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం ఎంతో కృషి చేశారు.

More Telugu News