Gulam Nabi Azad: కశ్మీర్ లో ఆర్టికల్ 370ని మళ్లీ తెచ్చుకోలేం.. అది ఎవరి వల్ల కాదు: గులాం నబీ ఆజాద్

Restoring Articlr 370 is not possible says Gulam Nabi Azad
  • జమ్మూకశ్మీర్ లో రెండేళ్ల క్రితం రద్దైన ఆర్టికల్ 370
  • దాన్ని మళ్లీ తెచ్చుకోవడం సాధ్యం కాదన్న ఆజాద్
  • వాస్తవాలను అందరికీ చెపుతున్నానని వ్యాఖ్య
కాంగ్రెస్ పార్టీకి ఇటీవలే గుడ్ బై చెప్పిన ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్ కు ఆర్టికల్ 370 ద్వారా లభించిన ప్రత్యేక ప్రతిపత్తిని మళ్లీ సాధించుకోవడం అసాధ్యమని ఆయన అన్నారు. రెండేళ్ల క్రితం ఆర్టికల్ 370ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి అందరికీ తెలిసిందే.  

ఉత్తర కశ్మీర్ లోని బారాముల్లాలో నిర్వహించిన ఒక బహిరంగసభలో ఆజాద్ మాట్లాడుతూ... స్థానిక రాజకీయ పార్టీలపై విమర్శలు గుప్పించారు. ఈ పార్టీలు ఇప్పటికీ ఆర్టికల్ 370పై కశ్మీర్ ప్రజలపై మభ్యపెడుతున్నాయని... ఆర్టికల్ 370ని మళ్లీ తీసుకురావడం సాధ్యం కాదని అన్నారు. కశ్మీర్ ప్రజలను తాను అందరిలా మభ్యపెట్టలేనని... వాస్తవాలను అందరికీ చెపుతున్నానని తెలిపారు. 

ఆర్టికల్ 370ని మళ్లీ తీసుకొస్తామని అందరిలా తాను మభ్యపెట్టనని చెప్పారు. ఓట్ల కోసం కశ్మీర్ ప్రజలను మోసం చేయలేనని అన్నారు. ఆర్టికల్ 370ని మళ్లీ తీసుకురావాలంటే పార్లమెంటులో టూ థర్డ్ మెజార్టీని సాధించాల్సి ఉంటుందని.. అది అసాధ్యమని చెప్పారు. బీజేపీని కాదని ఆర్టికల్ 370కి అనుకూలంగా మెజార్టీని సాధించే పార్టీ ప్రస్తుతం దేశంలో ఏదీ లేదని అన్నారు.
Gulam Nabi Azad
Jammu And Kashmir
Artical 370

More Telugu News