Ganesh Laddu: హైదరాబాద్ రిచ్ మండ్ విల్లాస్ లో రికార్డు స్థాయిలో రూ.60.80 లక్షల ధర పలికిన గణేశ్ లడ్డూ

Hyderabad Sun City Richmond Villas Ganesh Laddu gets record breaking price in auction
  • తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త రికార్డు
  • నిన్న ఆల్వాల్ లో రూ.46 లక్షలు పలికిన గణేశ్ లడ్డూ
  • ఇవాళ ఆ రికార్డు బద్దలు
  • సన్ సిటీ రిచ్ మండ్ విల్లాస్ లడ్డూకు అదిరిపోయే ధర
తెలుగు రాష్ట్రాల్లో గణేశ్ లడ్డూ వేలంలో సరికొత్త రికార్డు నమోదైంది. నిన్న ఆల్వాల్ లో మరకత వినాయకుడి లడ్డూ వేలం వేయగా రూ.46 లక్షలతో ఆల్ టైమ్ రికార్డు నమోదైంది. ఇప్పుడా రికార్డు కూడా బద్దలైంది. హైదరాబాద్ సన్ సిటీలోని రిచ్ మండ్ విల్లాస్ లో గణేశ్ లడ్డూ వేలం వేయగా, రికార్డు స్థాయిలో రూ.60.80 లక్షల ధర పలికింది. 

దాంతో ఇప్పటివరకు ఉన్న రికార్డులన్నీ తెరమరుగయ్యాయి. ఏపీ, తెలంగాణలో మరే గణేశ్ మండపం వద్ద కూడా స్వామివారి లడ్డూకు ఇంత ధర పలకలేదు. సన్ సిటీ రిచ్ మండ్ విల్లాస్ లో ఆర్వీ దియా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ లడ్డూ వేలం నిర్వహించారు.
Ganesh Laddu
Richmond Villas
Sun City
Auction
Hyderabad

More Telugu News