Pawan Kalyan: ప్రభాస్ ను, కృష్ణంరాజు కుటుంబ సభ్యులను పరామర్శించిన పవన్ కల్యాణ్... వీడియో ఇదిగో!

Pawan Kalyan pays tributes to Krishnam Raju mortal remains
  • సీనియర్ నటుడు కృష్ణంరాజు కన్నుమూత
  • తీవ్ర అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన రెబల్ స్టార్
  • కృష్ణంరాజు భౌతికకాయానికి నివాళులు అర్పించిన పవన్
  • కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు సంతాపం
పెదనాన్న కృష్ణంరాజు మరణంతో టాలీవుడ్ అగ్ర హీరో ప్రభాస్ తీవ్ర విషాదంలో ఉన్నారు. ఇవాళ కృష్ణంరాజు భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు వచ్చిన అగ్రహీరో, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కృష్ణంరాజు నివాసానికి వచ్చారు. అక్కడే ఉన్న ప్రభాస్ ను పవన్ ఆత్మీయంగా పరామర్శించారు. కృష్ణంరాజు మరణానికి దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యుల ప్రస్తుత పరిస్థితి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా, పవన్ కల్యాణ్ ను ప్రభాస్... కృష్ణంరాజు కుటుంబ సభ్యుల వద్దకు తీసుకెళ్లారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులతో మాట్లాడిన పవన్ కల్యాణ్ వారితో ధైర్యవచనాలు పలికారు. కాగా, కృష్ణంరాజు అంత్యక్రియలు రేపు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు.
Pawan Kalyan
Krishnam Raju
Prabhas
Tollywood

More Telugu News