మంచి స్నేహితుడిని కోల్పోయానన్న రఘురామకృష్ణరాజు.. టాలీవుడ్ కు తీరని లోటు అన్న రేవంత్ రెడ్డి
- తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందిన కృష్ణంరాజు
- రెబల్ స్టార్ గా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారన్న రేవంత్ రెడ్డి
- కృష్ణంరాజు మృతి వార్తతో దిగ్భ్రాంతికి గురయ్యానన్న రఘురాజు
కృష్ణంరాజు మృతి పట్ల వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం నిద్ర లేచిన వెంటనే కృష్ణంరాజు మరణ వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యానని చెప్పారు. ఒక మంచి స్నేహితుడిని, సన్నిహితుడిని కోల్పోయానని అన్నారు. కృష్ణంరాజుతో తనకు ఎంతో అనుబంధం ఉందని చెప్పారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు. కృష్ణంరాజు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు.