YSRCP: కొడాలి నానిపై తాడేప‌ల్లి పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన టీడీపీ నేత‌లు

tdp leaders complaont to tadcepalli police over kodali nani
  • ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో జ‌గ‌న్ ఫ్యామిలీకి వాటా ఉంద‌న్న టీడీపీ
  • టీడీపీ ఆరోప‌ణ‌ల‌ను ఖండించిన కొడాలి నాని
  • చంద్ర‌బాబు, లోకేశ్‌ల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేశారంటూ ఫిర్యాదు 
  • పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన దేవినేని, గ‌ద్దె, బుద్ధా, వ‌ర్ల‌
వైసీపీ కీల‌క నేత‌, కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై శ‌నివారం ఏపీ పోలీసుల‌కు ఫిర్యాదు అందింది. టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు, ఆయ‌న కుమారుడు నారా లోకేశ్‌ల‌పై కొడాలి నాని అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని, ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ పోలీసుల‌కు ఫిర్యాదు అందింది. ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కుటుంబం హ‌స్తం ఉంద‌ని టీడీపీ చేసిన ఆరోప‌ణ‌ల‌ను ఖండించేందుకు శుక్ర‌వారం మీడియా ముందుకు వ‌చ్చిన నాని.. చంద్ర‌బాబు, లోకేశ్‌ల‌పై ఘాటు వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

చంద్ర‌బాబు, లోకేశ్‌ల‌పై నాని అనుచిత వ్యాఖ్య‌లు చేశారనీ, కొడాలి నానిపై కేసు న‌మోదు చేసి చ‌ట్ట‌ప‌రంగా శిక్షించాల‌ని కోరుతూ టీడీపీ సీనియ‌ర్ నేత‌లు దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు, గ‌ద్దె రామ్మోహ‌న్ రావు, బుద్ధా వెంక‌న్న‌, వ‌ర్ల రామ‌య్య‌లు శ‌నివారం తాడేప‌ల్లి పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీక‌రించిన పోలీసులు... నానిపై కేసు న‌మోదు చేసే విషయంపై ప‌రిశీలిస్తున్నారు. 
YSRCP
YS Jagan
Kodali Nani
AP Police
TDP
Devineni Uma
Budda Venkanna
Gadde Rammohan
Varla Ramaiah
Tadepalli PS

More Telugu News