Congress: కేర‌ళ‌లో అడుగుపెట్టిన రాహుల్ గాంధీ పాద‌యాత్ర‌

  • ఈ నెల 7న క‌న్యాకుమారిలో యాత్ర మొద‌లుపెట్టిన రాహుల్
  • 4 రోజుల పాటు త‌మిళ‌నాడులోనే సాగిన యాత్ర‌
  • కేర‌ళ‌లోని పార‌సాల‌కు చేరుకున్న రాహుల్ గాంధీ
  • ఘ‌న స్వాగ‌తం ప‌లికిన కేర‌ళ కాంగ్రెస్ శ్రేణులు
rahul gandhi yatra entered in to kerala

భార‌త్ జోడో యాత్ర పేరిట కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేప‌ట్టిన పాద‌యాత్ర శ‌నివారం సాయంత్రం 6 గంట‌ల స‌మ‌యంలో కేర‌ళలో అడుగు పెట్టింది. 150 రోజుల పాటు దేశంలోని మెజారిటీ రాష్ట్రాల‌ను తాకుతూ 3,570 కిలోమీట‌ర్ల మేర కొన‌సాగ‌నున్న ఈ యాత్ర‌ను ఈ నెల 7న త‌మిళ‌నాడులోని క‌న్యాకుమారిలో రాహుల్ గాంధీ మొద‌లుపెట్టిన సంగ‌తి తెలిసిందే. శ‌నివారం నాటికి యాత్ర నాలుగు రోజుల పాటు సాగ‌గా.. నాలుగో రోజు సాయంత్రానికి త‌మిళ‌నాడులో యాత్ర‌ను పూర్తి చేసుకుని రాహుల్ గాంధీ కేర‌ళ‌లో అడుగుపెట్టారు.

త‌మిళ‌నాడులోని క‌న్యాకుమారి జిల్లాలోనే కొన‌సాగిన రాహుల్ పాద‌యాత్ర‌... శ‌నివారం సాయంత్రం కేర‌ళ‌లోని పార‌సాల‌కు చేరుకుంది. ఈ సంద‌ర్భంగా త‌మ రాష్ట్రంలో అడుగుపెట్టిన రాహుల్ గాంధీకి కేర‌ళ కాంగ్రెస్ ఘ‌న స్వాగ‌తం ప‌లికింది. కేర‌ళ ప్ర‌జ‌లు దారి పొడ‌వునా రాహుల్ గాంధీకి పూల‌తో స్వాగతం పలికారు.

More Telugu News