Sujana Chowdary: మూడు రాజధానులను నిర్మించడం వైసీపీ ప్రభుత్వం వల్ల కాదు: సుజనా చౌదరి

Amaravati will be AP capital says Sujana Chowdary
  • అమరావతిపై కేంద్రం సరైన నిర్ణయం తీసుకుంటుందన్న సుజన
  • అమరావతే ఆంధ్రుల రాజధానిగా ఉంటుందని ధీమా 
  • వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీజేపీ సత్తా చాటుతుందని వ్యాఖ్య 
త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లును పెడతామని ఏపీ మంత్రులు వ్యాఖ్యానిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో, మరోసారి అమరావతి అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో బీజేపీ నేత సుజనా చౌదరి మాట్లాడుతూ, అమరావతిపై కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. అమరావతే ఆంధ్రుల రాజధానిగా ఉంటుందని అన్నారు. మూడు రాజధానులను నిర్మించడం వైసీపీ ప్రభుత్వం వల్ల కాదని చెప్పారు. తమ హక్కుల కోసం అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రకు బీజేపీ మద్దతు పూర్తిగా ఉంటుందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీజేపీ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు.
Sujana Chowdary
BJP
Amaravati
YSRCP
3 Capitals

More Telugu News