Nagashourya: 'కృష్ణ వ్రింద విహారి' నుంచి ట్రైలర్ రిలీజ్!

  • నాగశౌర్య నుంచి మరో ప్రేమకథ
  • కథానాయికగా షిర్లే పరిచయం
  • ఆకట్టుకుంటున్న ట్రైలర్ 
  • ఈ నెల 23వ తేదీన సినిమా రిలీజ్
Krishna Vrinda Vihari Movie Trailer Released

నాగశౌర్య హీరోగా 'కృష్ణ వ్రింద విహారి' సినిమా రూపొందింది. తన సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ పై నిర్మితమైన ఈ సినిమాకి అనీష్ కృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో షిర్లే సెటియా కథానాయికగా పరిచయమవుతోంది. మహతి స్వరసాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. ఇంతవరకూ ఈ సినిమా నుంచి వచ్చిన అప్ డేట్స్ ఆసక్తిని పెంచుతూ వెళ్లాయి. 

కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ, లవ్ .. రొమాన్స్ .. కామెడీ .. యాక్షన్ కి సంబంధించిన సన్నివేశాలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. గ్రామీణ నేపథ్యంలో తల్లిముందు అమాయకంగా కనిపించిన హీరో, ఉద్యోగం కోసం సిటీకి వెళతాడు. తన ఆఫీసులోని అమ్మాయితో ప్రేమలో పడతాడు.

హీరో పెరిగిన వాతావరణానికీ .. హీరోయిన్ పెరిగిన వాతావరణానికి చాలా తేడా ఉంటుంది. ఆ తరువాత ఏం జరగనుందనే ఆసక్తిని రేకెత్తించారు. వెన్నెల కిశోర్ .. సత్య కామెడీ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాధిక కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమా, ఈ నెల 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. 

More Telugu News