నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్రకు బండి సంజయ్ సన్నద్ధం... ఈ నెల 12న ప్రారంభోత్సవ సభ

  • తెలంగాణలో అధికారం కోసం తీవ్రంగా శ్రమిస్తున్న బీజేపీ
  • ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టిన బండి సంజయ్
  • పాదయాత్ర ఇప్పటివరకు మూడు విడతలు పూర్తి
  • నాలుగోవిడతకు కుత్బుల్లాపూర్ లో శంఖారావం
Bandi Sanjay set to start fourth phase Praja Sangrama Yatra

తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ పాదయాత్ర ఇప్పటివరకు మూడు విడతలు పూర్తయ్యాయి. 

ఈ నేపథ్యంలో, బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్రకు సన్నద్ధమయ్యారు. ఈ నెల 12న కుత్బుల్లాపూర్ రాంలీలా మైదానంలో ఉదయం 10 గంటలకు నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభోత్సవ సభ జరగనుంది. ఈ సభకు ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ హాజరుకానున్నారు. ఈ మేరకు బీజేపీ తెలంగాణ విభాగం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

More Telugu News