simbu: ‘ముత్తు’గా వస్తున్న శింబు

Sravanthi Movies To Release Simbu Gautham Menon The Life Of Muthu On September 15th
  • గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘వెందు తుణీందదు కాడు’ 
  • ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వంలో ఈ నెల 15న వస్తున్న చిత్రం
  • తెలుగులో ‘ద లైఫ్‌‌ ఆఫ్ ముత్తు’గా విడుదల చేస్తున్న స్రవంతి మూవీస్
తమిళ హీరో శింబు, ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కాంబినేషన్ లో ఇప్పటికే వరుసగా రెండు హిట్లు వచ్చాయి. ఈ ముగ్గురి కాంబినేషన్ లో వస్తున్న మూడో చిత్రం ‘వెందు తుణీందదు కాడు’. ఈ చిత్రం తమిళ్ తో పాటు తెలుగులో నేరుగా విడుదల కానుంది. ‘ద లైఫ్‌‌ ఆఫ్ ముత్తు’ పేరుతో తెలుగులో స్రవంతి రవికిశోర్ విడుదల చేస్తున్నారు. ఈ నెల 15వ తేదీన విడుదల కానుంది. ఇందులో శింబు సరసన సిద్ధి ఇద్నాని హీరోయిన్ గా నటించింది. రాధిక శరత్ కుమార్ మరో కీలక పాత్ర చేసింది. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై శింబు, ఇషారి.కె.గణేష్ ఈ భారీ ప్రాజెక్టును నిర్మించారు. 

చాన్నాళ్ల తర్వాత శింబు నేరుగా తెలుగులో తన చిత్రాన్ని విడుదల చేస్తున్నాడు. తమిళ హీరోనే అయినప్పటికీ తెలుగులో కూడా శింబుకు మంచి క్రేజ్ ఉంది. మన్మథ, వల్లభ, మానాడు లాంటి చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువయ్యాడు. ఈ ఇద్దరితో పాటు గౌతమ్ మీనన్, రెహమాన్ కు కూడా తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. దాంతో, తెలుగులోనూ ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని హీరో శింబుతో పాటు స్రవంతి రవికిశోర్ నమ్మకంగా ఉన్నారు. ఇంతకు ముందు తమ సంస్థ ద్వారా నాయకుడు, పుష్పకవిమానం, రెండు తోకల పిట్ట, రఘువరన్ బీటెక్ చిత్రాలు డబ్ చేశామని, అవి మంచి విజయం సాధించాయన్నారు. శింబు ‘ముత్తు’ కూడా తెలుగు ప్రేక్షకులకు తప్పక నచ్చుతుందని అంటున్నారు.
simbu
Sravanthi Movies
Gautham Menon
The Life Of Muthu
September 15th

More Telugu News