Karan Johar: కరణ్ జొహార్ మరో సంచలనం.. బాలీవుడ్ రహస్యాలతో కొత్త వెబ్ సిరీస్

Karan Johar announces new web series Showtime promises to reveal entertainment industrys biggest secrets
  • డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం
  • కాఫీ విత్ కరణ్ జొహార్ 8వ సిరీస్ సైతం ఓటీటీలోనే
  • కొత్త మహాభారత్ సిరీస్ పైనా ప్రకటన
‘కాఫీ విత్ కరణ్ షో’తో ఎంతో పాప్యులర్ అయిన కరణ్ జొహార్.. మరో సంచలనానికి సిద్ధమయ్యారు. బాలీవుడ్ రహస్యాలను బాహ్య ప్రపంచానికి చెప్పేందుకు ఓ వెబ్ సిరీస్ ను చేయనున్నట్టు ప్రకటించారు. ఈ నూతన వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం అవుతుంది. గ్లోబల్ డిస్నీ ఫ్యాన్ ఈవెంట్ (డీ23 ఎక్స్ పో) లో భాగంగా కరణ్ ఈ విషయాన్ని ప్రకటించాడు. 

హాట్ స్టార్ లో ప్రసారమయ్యే కొత్త షోలో వినోద ప్రపంచం అతిపెద్ద వాణిజ్య రహస్యాలను వెలుగులోకి తీసుకొస్తానని కరణ్ జొహార్ ప్రకటన చేశాడు. ఇక ప్రస్తుతం కాఫీ విత్ కరణ్ 7 సీజన్ స్టార్ వరల్డ్ లో ప్రసారం అవతుండగా.. ఇందులో నటీ నటుల వ్యక్తిగత జీవిత రహస్యాలను తవ్వితీస్తుండడం తెలిసిందే. కాఫీ విత్ కరణ్ 8వ సీజన్ గురించి డిస్నీ హాట్ స్టార్ ప్రకటన చేసింది. తదుపరి సీజన్ పూర్తిగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో ప్రసారం అవుతుందని పేర్కొంది. క్రితం ఆరు సీజన్లు కూడా స్టార్ వరల్డ్ లోనే ప్రసారం కావడాన్ని గమనించాలి. 

ఇక డీ23 ఎక్స్ పోలో డిస్నీ హాట్ స్టార్ చేసిన మరో కీలక ప్రకటన.. మహాభారత్ కొత్త సిరీస్ ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల చేయనుంది. మధు మంతెన, మైతోవర్స్ స్టూడియోస్, అల్లు ఎంటర్ టైన్ మెంట్ నిర్మాణంలో ఇది రూపొందనుంది.
Karan Johar
Bollywood
biggest secrets
koffee with karan
disney plus hotstar
Mahabharath

More Telugu News