Telangana University: విద్యార్థినులతో కలిసి డ్యాన్సులు చేసిన యూనివర్శిటీ వీసీ.. మండిపడుతున్న విద్యార్థి సంఘాలు

Telanga University VC Ravinder Gupta dances in ladies hostel
  • నిన్న వినాయక నిమజ్జనం తర్వాత గర్ల్స్ హాస్టల్ వద్దకు వెళ్లిన రవీందర్ గుప్తా
  • డ్యాన్సులు చేసి, డబ్బులు పంచిన వైనం
  • వీసీపై చర్యలు తీసుకోవాలని విద్యార్థినుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల డిమాండ్
తెలంగాణ యూనివర్శిటీ వైస్ ఛాన్సెలర్ రవీందర్ గుప్తాపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన చేసిన నిర్వాకంపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే... నిన్న వినాయక నిమజ్జనం తర్వాత గర్ల్స్ హాస్టల్ వద్దకు వెళ్లిన రవీందర్ గుప్తా హాస్టల్ లో డ్యాన్సులు చేశారు. అనుమతులు లేకపోయినప్పటికీ మరో ఇద్దరు వ్యక్తులతో అక్కడకు వెళ్లి ఆయన డ్యాన్సులు చేశారు. 

అంతేకాదు, డబ్బులు కూడా పంచారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. యూనివర్శిటీకి తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి... విద్యార్థినులతో కలిసి ఇలా డ్యాన్సులు చేయడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. రవీందర్ గుప్తాపై చర్యలు తీసుకోవాలని విద్యార్థినుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.
Telangana University
VC
Ravinder Gupta
Women Students
Dance

More Telugu News