బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ అనంతబాబు... విచారణను వాయిదా వేసిన హైకోర్టు
- డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడు అనంతబాబు
- తల్లి మరణంతో మధ్యంతర బెయిల్‌తో బయటకొచ్చిన వైనం
- రెగ్యులర్ బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వైనం
- విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేసిన హైకోర్టు
- రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో లొంగిపోయిన ఎమ్మెల్సీ
ఇటీవలే తన తల్లి మరణించగా...తల్లి అంత్యక్రియల్లో పాలుపంచుకునే నిమిత్తం అనంతబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. కేవలం 3 రోజులు మాత్రమే రాజమహేంద్రవరం కోర్టు బెయిల్ మంజూరు చేయగా...దానిపై అనంతబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో అనంతబాబు బెయిల్‌ను మరో 11 రోజుల పాటు పొడిగిస్తూ హైకోర్టు గత నెలలో ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ బెయిల్ గడువు ముగియడం, రెగ్యులర్ బెయిల్‌పై హైకోర్టు విచారణను వాయిదా వేయడంతో శుక్రవారం అనంతబాబు జైలులో లొంగిపోయారు.