Padmini Kolhapure: యువరాజు చార్లెస్ కు.. గుర్తుండిపోయే గిఫ్ట్ ఇచ్చిన నాటి బాలీవుడ్ భామ పద్మిని

When Padmini Kolhapure gave prince Charles a surprise kiss
  • 1981లో ముంబైకి వచ్చిన ప్రిన్స్ చార్లెస్
  • అహిష్ట అహిష్ట సినిమా షూటింగ్ సెట్స్ సందర్శన
  • ఆయన మెడలో పూలదండ వేసి ముద్దాడిన పద్మిని కొల్హాపురి
బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ 2 మరణించడంతో ఆమె కుమారుడైన ప్రిన్స్ చార్లెస్ ఇప్పుడు బ్రిటన్ రాజు కాబోతున్నారు. ప్రిన్స్ చార్లెస్ దగ్గర బాలీవుడ్ అలనాటి కథానాయిక పద్మిని కొల్హాపురి గురించి ప్రస్తావిస్తే ఆయన గత జ్ఞాపకాలను కచ్చితంగా గుర్తు చేసుకుంటారు. ఎందుకంటే యువరాజు మర్చిపోలేని పనిని ఆమె చేసింది. చెక్కిళ్లపై ముద్దు పెట్టింది. ఇది 1981లో జరిగింది. 

నాడు ముంబైలోని రాజ్ కమల్ స్టూడియోస్ లో 'అహిష్ట అహిష్ట' సినిమా షూటింగ్ చిత్రీకరణ సెట్స్ వద్దకు యువరాజు చార్లెస్ వచ్చారు. ఆ సమయంలో పద్మిని పూలదండతో చార్లెస్ వద్దకు వెళ్లి ఆయన మెడలో వేసింది. తర్వాత చెంపపై ముద్దు ఇచ్చింది. దాంతో నాడు భారత్ తోపాటు, బ్రిటన్ లోనూ ఆమె పత్రికల ప్రధాన పేజీల్లోకి ఎక్కారు. నిజానికి పద్మిని కూడా ఇదే కోరుకుందట. 2007లో ఓ ఆంగ్ల మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంలో పద్మిని ఈ విషయాన్ని వెల్లడించారు. 

ప్రిన్స్ చార్లెస్ ను ముద్దాడిన మహిళగా తాను గుర్తుండిపోవాలన్నదే తన ఉద్దేశ్యమని ఆమె చెప్పింది. ఆ తర్వాత ఓ సారి తను లండన్ వెళ్లినప్పుడు బ్రిటిష్ ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్ పద్మినిని చూసి.. ‘ప్రిన్స్ చార్లెస్ ను కిస్ చేసింది మీరే కదా?’అని అడిగారట. ఆమె సిగ్గుతో అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు చెప్పింది. ఇంతకాలం యువరాజుగా ఉన్న చార్లెస్ ఇప్పుడు బ్రిటన్ రాజు కానుండడంతో ఈ ఘటనను కొందరు గుర్తు చేసుకుంటున్నారు.
Padmini Kolhapure
Bollywood
actor
prince Charles
kiss

More Telugu News