CM Jagan: ఈ నెల 22న కుప్పం వస్తున్న సీఎం జగన్

CM Jagan will visit Kuppam on September 22
  • కుప్పంలో సీఎం పర్యటన ఖరారు
  • కుప్పం మున్సిపాలిటీలో రూ.66 కోట్లతో అభివృద్ధి పనులు
  • శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్
  • హెలీప్యాడ్ స్థలాలను పరిశీలించిన పార్టీ నేతలు
ఏపీ సీఎం జగన్ చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించనున్నారు. ఈ నెల 22న ఆయన కుప్పం రానున్నారు. కుప్పం మున్సిపాలిటీలో రూ.66 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. ఈ మేరకు సీఎం పర్యటన ఖరారైనట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. సీఎం రానుండడంతో ఎమ్మెల్సీ భరత్, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు హెలీప్యాడ్ కోసం స్థలాలను పరిశీలించారు. 

కాగా, విపక్షనేత చంద్రబాబు సొంత నియోజకవర్గంలోకి సీఎం వస్తుండడంతో ఈ పర్యటనకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఇటీవల కుప్పంలో చంద్రబాబు పర్యటించిన సమయంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనడం తెలిసిందే. 2024 ఎన్నికల్లో కుప్పం స్థానాన్ని కూడా కైవసం చేసుకోవాలన్నది వైసీపీ ప్రణాళికల్లో ముఖ్యమైనదిగా తెలుస్తోంది.
CM Jagan
Kuppam
YSRCP
Chandrababu
TDP
Andhra Pradesh

More Telugu News