Team India: ఆసియాకప్: టీమిండియాతో మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్థాన్

Afghanistan won the toss against Team India in Asia Cup match
  • అప్రాధాన్య మ్యాచ్ లో భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆఫ్ఘన్
  • టోర్నీ నుంచి ఇప్పటికే నిష్క్రమించిన టీమిండియా
  • రోహిత్, చహల్, పాండ్యాలకు విశ్రాంతి
ఆసియా కప్ సూపర్-4 దశలో నేడు ఎలాంటి ప్రాధాన్యం లేని మ్యాచ్ లో టీమిండియా, ఆఫ్ఘనిస్థాన్ తలపడుతున్నాయి. టోర్నీలో ఇప్పటికే పాకిస్థాన్, శ్రీలంక జట్లు ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే. నిన్న పాక్ తో పోరులో ఆఫ్ఘన్ జట్టు గెలిసుంటే ఇవాళ్టి మ్యాచ్ టీమిండియాకు ఎంతో కీలకమయ్యేది. కానీ, ఆఫ్ఘన్ ఓడిపోవడంతో టోర్నీ నుంచి టీమిండియా సాంకేతికంగా నిష్క్రమించినట్టయింది. 

ఇక, నేటి మ్యాచ్ విషయానికొస్తే... ఆఫ్ఘనిస్థాన్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియా మొదట బ్యాటింగ్ చేయనుంది. కాగా, ఈ మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, యజువేంద్ర చహల్ ఆడడంలేదు. వారి స్థానంలో దీపక్ చహర్, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్ తుదిజట్టులోకి వచ్చారు. రోహిత్ స్థానంలో కేఎల్ రాహుల్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.
Team India
Afghanistan
Toss
Super-4
Asia Cup

More Telugu News