Mamata Banerjee: విపక్షాలు ఐక్యంగా ఉన్నాయి.. కలిసే పోరాడుతాం: మమతా బెనర్జీ

Opposition parties will fight together says Mamata Banerjee
  • 2024 ఎన్నికల్లో విపక్షాలు ఐక్యంగా బీజేపీని ఎదుర్కొంటాయన్న మమత 
  • రాజకీయమంటేనే యుద్ధమని కామెంట్ 
  • మీడియా అసత్య ప్రసారాలు చేస్తోందని ఆరోపణ 

2024 సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాలన్నీ ఐక్యంగా బీజేపీని ఎదుర్కొంటాయని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. విపక్షాలన్నీ ఐక్యంగా ఉన్నాయని... అందరం కలిసే పోరాడుతామని తెలిపారు. బెంగాల్ సీఎం నితీశ్ కుమార్, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తదితరులతో కలిసి ముందుకు సాగుతామని చెప్పారు. రాజకీయమంటేనే యుద్ధమని ఆమె అన్నారు. గత 34 ఏళ్లుగా తాము పోరాడుతూనే ఉన్నామని అన్నారు. 

మీడియా కూడా అసత్య ప్రచారాలను చేస్తుండటం దురదృష్టకరమని మమత చెప్పారు. తనకు, అభిషేక్ బెనర్జీకి మధ్య విభేదాలు ఉన్నాయని ప్రచారం చేసిందని... ఇలాంటి అవాస్తవాలతో టీఆర్పీ పెరగదని అన్నారు. పశువుల స్మగ్లింగ్ కేసులో అనుబ్రత మొండల్ అరెస్ట్ పై మాట్లాడుతూ... ఆయన పోరాట యోధుడిగా జైలు నుంచి బయటకు వస్తారని చెప్పారు. పెద్ద నేతలు అరెస్ట్ అయితే, కార్యకర్తలు భయపడతారని వారు భావిస్తున్నారని అన్నారు.

  • Loading...

More Telugu News