భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

08-09-2022 Thu 16:19 | Business
  • 659 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 174 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 3.23 శాతం లాభపడ్డ టెక్ మహీంద్రా షేర్ విలువ
Markets ends in profits
వరుసగా రెండు రోజుల పాటు నష్టపోయిన మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూలతలు, క్రూడాయిల్ ధరలు తగ్గడం వంటి కారణాలతో మార్కెట్లలో కొనుగోళ్ల సందడి కనిపించింది. దీంతో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 659 పాయింట్లు లాభపడి 59,688కి చేరుకుంది. నిఫ్టీ 174 పాయింట్లు పెరిగి 17,799కి ఎగబాకింది. 

బీఎస్ఈ సెన్సెక్ టాప్ గెయినర్స్:
టెక్ మహీంద్రా (3.23%), యాక్సిస్ బ్యాంక్ (3.22%), ఐసీఐసీఐ బ్యాంక్ (2.57%), మహీంద్రా అండ్ మహీంద్రా (2.48%), భారతి ఎయిర్ టెల్ (2.28%). 

టాప్ లూజర్స్:
టాటా స్టీల్ (-1.63%), ఎన్టీపీసీ (-0.33%), టైటాన్ (-0.32%), నెస్లే (-0.15%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-0.09%).