Hemanth Soren: ఝార్ఖండ్ సీఎం సోదరుడి వివాదాస్పద వ్యాఖ్యలు

Went to Delhi to buy underwear says Jharkhand CMs brother
  • వివాదాస్పదమవుతున్న బసంత్ సోరెన్ వ్యాఖ్యలు
  • ఆయన నియోజకవర్గంలో ఇద్దరు బాలికల హత్యాచారం
  • అట్టుడుకుతున్న దుమ్కా నియోజకవర్గం
  • అండర్ వేర్ లు కొనుక్కోవడానికి వెళ్లానన్న బసంత్ 
ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గత వారం పెద్ద రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి ఆయన బలపరీక్షను కూడా ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఆయన సోదరుడు, ఎమ్మెల్యే బసంత్ సోరెన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమై, ఆయనకు మరో చిక్కును తెచ్చిపెట్టాయి. 

తాజాగా ఆయన ఢిల్లీకి వెళ్లి వచ్చారు. ఇద్దరు అమ్మాయిలను అత్యాచారం చేసి, చంపేసిన ఘటన ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న దుమ్కా నియోజకవర్గాన్ని అట్టుడికేలా చేస్తోంది. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన బసంత్ సోరెన్... హత్యాచారానికి గురైన బాలికల కుటుంబాలను పరామర్శించారు. 

ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక్కడ ఇంత జరుగుతుంటే మీరు ఢిల్లీకి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా... అండర్ వేర్ లు కొనుక్కోవడానికి వెళ్లానని అన్నారు. వాటిని ఢిల్లీ నుంచి తెచ్చుకున్నానని చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు మీడియాలో వైరల్ అవుతున్నాయి. విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
Hemanth Soren
Basant Soren
Jharkhand
Underwear

More Telugu News