Netflix: నెట్ ఫ్లిక్స్ ఆఫర్ చేస్తున్న చౌక ప్లాన్లు ఇవే..

Cheaper Netflix plans with ads launching soon List of Netflix plans in India prices and benefits
  • త్వరలోనే ప్రకటనలతో కూడిన చౌక టారిఫ్ లు
  • మొబైల్ ఫోన్ కు ప్రస్తుత ప్లాన్ రూ.149
  • రూ.199 ప్లాన్ లో అన్ని రకాల డివైజ్ లపై వినియోగించే వెసులుబాటు
నెట్ ఫ్లిక్స్ ప్రకటనలతో కూడిన చౌక సబ్ స్క్రిప్షన్ ప్లాన్లను త్వరలోనే ప్రకటించనుంది. కొత్త కస్టమర్లను ఆకర్షించే లక్ష్యంతో నెట్ ఫ్లిక్స్ అడుగులు వేస్తోంది. దీనికి కారణం ఇటీవలి కాలంలో నెట్ ఫ్లిక్స్ ప్రపంచవ్యాప్తంగా చందారులను నష్టపోతోంది. దీనికి విరుగుడుగా చౌక ప్లాన్లను తీసుకురానున్నట్టు సంస్థ లోగడే ప్రకటించింది.

అయితే, చౌక ప్లాన్లు కంపెనీకి గిట్టుబాటు కావు కనుక, ఆదాయం కోసం ఈ ప్లాన్లలోని వారికి వాణిజ్య ప్రకటనలతో కూడిన సేవలు అందించాలని నెట్ ఫ్లిక్స్ నిర్ణయించుకుంది. యూట్యూబ్ మాదిరిగా.. వీడియోలు చూసే సమయంలో మధ్యలో ప్రకటనలు వస్తుంటాయి. ప్రస్తుతం మన దేశంలో నెట్ ఫ్లిక్స్ ఆఫర్ చేస్తున్న ప్లాన్లను పరిశీలించినట్టయితే.. 

రూ.149
ఇది స్మార్ట్ ఫోన్ల యూజర్లకు ఉద్దేశించిన ప్లాన్. 480 పిక్సల్ నాణ్యత వీడియోలను ఇందులో అందిస్తుంది. ఏక కాలంలో ఒక డివైజ్ నుంచే నెట్ ఫ్లిక్స్ వాడుకోవడానికి ఉంటుంది. 

రూ.199
480 పిక్సల్స్ నాణ్యతతో ఫోన్, టాబ్లెట్, కంప్యూటర్ లేదా టీవీపై నెట్ ఫ్లిక్స్ సేవలను వీక్షించొచ్చు. ఇది కూడా ఒకేసారి రెండు పరికరాల్లో చూడడానికి ఉండదు.

రూ.499
ఇది కూడా ఫోన్, టాబ్లెట్, కంప్యూటర్ లేదా టీవీలకు ఉద్దేశించిన ప్లాన్. కాకపోతే ఇందులో 1080 పిక్సల్ అధిక నాణ్యతతో వీడియోలను వీక్షించొచ్చు. అన్ని రకాల డివైజ్ లపై ఇది పనిచేస్తుంది.

రూ.649
ఇది ప్రీమియం ప్లాన్. ఫోన్, టాబ్లెట్, కంప్యూటర్ లేదా టీవీలో 4కే హెచ్ డీఆర్ స్ట్రీమింగ్ చేసుకోవచ్చు.
Netflix
cheaper plans
benefits
all plans

More Telugu News