Bengaluru: వర్షాలతో బెంగళూరు ఇప్పటికే అతలాకుతలం... మరో 5 రోజులకు వర్ష సూచన చేసిన ఐఎండీ

IMD issues rain allert for five days as Bengaluru still in flood grip
  • ఇటీవల బెంగళూరులో భారీ వర్షాలు
  • నగరం జలమయం
  • ఇంకా ముంపులోనే లోతట్టు ప్రాంతాలు
  • మరోసారి వర్ష సూచనతో ఆందోళనలో బెంగళూరు వాసులు

గత కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు బెంగళూరు నగరం వరద గుప్పిట్లో చిక్కుకుంది. భారీ వర్షం కురిస్తే చాలు... ఈ గార్డెన్ సిటీ జలమయం అవుతోంది. ఇప్పటికే జనజీవనం అస్తవ్యస్తమైంది. ట్రాఫిక్ లో వాహనాలు వరద నీటిలోనే అతి కష్టమ్మీద ప్రయాణిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఆఫీసుల్లో కార్యకలాపాలు మందగించాయి. కాగా, ఇవాళ కొన్ని ప్రాంతాల్లో వరద ప్రభావం తగ్గిపోయింది. 

అయితే, భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బెంగళూరు వాన కష్టాలు ఇప్పట్లో తీరవని చెబుతోంది. బెంగళూరు సహా కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో మరో 5 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తాజా ప్రకటనలో వెల్లడించింది. బెంగళూరులో ఓ మోస్తరు వర్షాలు పడతాయని చెప్పిన ఐఎండీ, ఎగువ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది.

ఇప్పటికే బెంగళూరు పరిసర జలాశయాలు పొంగిపొర్లుతున్నాయి. బెంగళూరులోని పలు ప్రాంతాలు ఇంకా నీటి ముంపులోనే ఉన్నాయి. మరికొన్ని రోజుల పాటు వర్షాలు పడతాయన్న హెచ్చరికల నేపథ్యంలో, బెంగళూరు ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

  • Loading...

More Telugu News