Samantha: 'యశోద' నుంచి టీజర్ రెడీ!

Yashoda Movie Update
  • 'యశోద'గా ప్రధానమైన  పాత్రలో సమంత
  • కీలకమైన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ 
  • ఈ నెల 9న సాయంత్రం టీజర్ రిలీజ్
  • సంగీత దర్శకుడిగా మణిశర్మ    
తెలుగు .. తమిళ భాషల్లో సమంతకి విపరీతమైన క్రేజ్ ఉంది. ఆమె నాయిక ప్రధానమైన పాత్రలను పోషించిన 'ఓ బేబీ' .. ' యూ టర్న్' సినిమాలు మంచి విజయాలను సాధించాయి. అదే తరహాలో ఆమె చేసిన 'యశోద' కూడా ఈ రెండు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రావడానికి ముస్తాబవుతోంది. సైన్స్ ఫిక్షన్ తో కూడిన థ్రిల్లర్ సినిమా ఇది.

ఈ సినిమా నుంచి ఈ నెల 9వ తేదీన సాయంత్రం 5:49 నిమిషాలకు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. భయం .. బాధతో కూడిన ఎక్స్ ప్రెషన్ తో సమంత ఈ పోస్టర్ లో కనిపిస్తోంది. టైటిల్ దగ్గర నుంచి ఈ సినిమా అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తూ వస్తోంది. 

శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి హరి శంకర్ - హరి నారాయణ్ దర్శకత్వం వహించారు. మణిశర్మ సంగీతం ఈ సినిమాకి హైలైట్ అవుతుందని అంటున్నారు. రావు రమేశ్ .. మురళీ శర్మ .. ఉన్నిముకుందన్ .. సంపత్ రాజ్ .. వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.
Samantha
Unni Mukundan
Varalakshmi Sharath Kumar
Yashoda Movie

More Telugu News