BJP: లీజుకు రైల్వే స్థ‌లాలు.. కేంద్ర కేబినెట్ తాజా నిర్ణ‌యం!

union cabinet approves indian railways lands lease to private parties
  • ఇప్ప‌టిదాకా రైల్వే స్ధ‌లాల లీజు ఊసే లేని వైనం
  • తాజాగా ప్రైవేట్ వ్య‌క్తుల‌కు రైల్వే స్థ‌లాల లీజు
  • పీఎం గతి శ‌క్తి యోజ‌న‌కు నిధుల కోస‌మే ఈ నిర్ణ‌యం
  • పీఎం శ్రీ ప‌థ‌కానికి కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన కేంద్ర కేబినెట్‌
ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ నేతృత్వంలో బుధ‌వారం భేటీ అయిన కేంద్ర కేబినెట్ ఓ కీల‌క నిర్ణ‌యాన్ని తీసుకుంది. భార‌తీయ రైల్వేల‌కు చెందిన స్థ‌లాల‌ను లీజుకు ఇచ్చే విష‌యంపై కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టిదాకా రైల్వే స్థ‌లాల‌ను లీజుకు ఇచ్చే అవ‌కాశ‌మే లేక‌పోగా... తాజాగా ఈ స్థ‌లాల‌ను ప్రైవేట్ వ్య‌క్తులు లీజుకు తీసుకునే వెసులుబాటు ల‌భించింది. 

పీఎం గ‌తి శ‌క్తి యోజ‌న‌కు నిధులు స‌మ‌కూర్చుకునేందుకు రైల్వే స్థ‌లాల‌ను లీజుకు ఇవ్వాల‌ని కేంద్ర కేబినెట్ నిర్ణ‌యించింది. ఇక పీఎం శ్రీ పేరిట స‌ర్కారీ స్కూళ్ల మెరుగుద‌ల‌కు ప్ర‌ధాని మోదీ ప్ర‌క‌టించిన నూతన ప‌థ‌కానికి కూడా కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోద ముద్ర వేసింది. రానున్న ఐదేళ్ల‌లో 14 వేల స్కూళ్ల‌ను రూ.23 వేల కోట్లతో అభివృద్ధి చేయాల‌ని మంత్రివ‌ర్గం తీర్మానించింది. ఈ పథ‌కం ద్వారా దేశ‌వ్యాప్తంగా 18 ల‌క్ష‌ల మంది విద్యార్థుల‌కు ల‌బ్ధి చేకూర‌నుంద‌ని కేబినెట్ తెలిపింది.
BJP
Union Cabinet
Indian Railways
PM Gati Shaksti Yojana
PM SHRI Yojana

More Telugu News