Bandi Sanjay: స్పీకర్ పోచారం తీరుపై అసెంబ్లీలో చర్చ జరగాలి: బండి సంజయ్

Bandi Sanjay demands action against assembly speaker Pocharam
  • రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ రాజకీయ విమర్శలు చేస్తున్నారన్న సంజయ్ 
  • స్పీకర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్
  • బీజేపీ అంటేనే కేసీఆర్ వణికిపోతున్నారని ఎద్దేవా
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ రాజకీయ విమర్శలు చేస్తారా? అని ప్రశ్నించారు. బీజేపీ అంటేనే ముఖ్యమంత్రి కేసీఆర్ వణికిపోతున్నారని అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు లేకుండా కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. సభలో ప్రజా సమస్యలను చర్చించకుండా చేస్తున్నారని అన్నారు. 

అసెంబ్లీలో కుదరకపోతే ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటామని చెప్పారు. స్పీకర్ వ్యవహారశైలిపై అసెంబ్లీలో చర్చ జరగాలని అన్నారు. స్పీకర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీలో కొత్తగా నియమితులైన పార్లమెంటు కన్వీనర్లు, జాయింట్ కన్వీనర్లు, జిల్లా ఇన్ఛార్జీలతో ఈరోజు బండి సంజయ్ భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు.
Bandi Sanjay
BJP
Pocharam Srinivas
KCR
TRS

More Telugu News